కలెక్టరేట్‌లో ప్రజావాణి.. 100 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ప్రజావాణి.. 100 ఫిర్యాదులు

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణికి 100 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ స మస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఆర్వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్‌, ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డికి వివరిస్తూ అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్య లను పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement