వర్ని: రైతులు పండించిన ధాన్యాన్ని హడావుడిగా విక్రయించి నష్టపోవద్దని రోజువారి పరిస్థితులను బట్టి అధిక ధరకు విక్రయించి లాభాలు పొందాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాతవర్ని సహకార సంఘంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల గోదాంను సోమవారం ఆయ న ప్రారంభించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల మూలంగా రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయడం లేదని కేవలం ఒక్క ని జాంసాగర్ ప్రాజెక్టు నుంచి మాత్రమే విడుదల చే స్తున్నట్లు తెలిపారు. అనంతరం ప లు గ్రామాల్లో నూతన జీపీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు,నాయకులు కాసుల బాలరాజు,సురేష్ బాబా, ఆనంద్, సాయిబాబా, నేమా ని వీర్రాజు, హరిదాసు, రంజానాయక్ తదితరులు పాల్గొన్నారు.


