సుభాష్‌నగర్:ఎంపీ అర్వింద్‌పై ఆర్మూర్ మాజీ ఎ మ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, మరోసారి ఎంపీపై అవాకులు, చెవాకులు పేల్చితే ఊరుకోబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడితే అర్వింద్‌ను, నాయకులను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నిజామాబాద్ జిల్లాలో చేసిన అభివృద్ధి, ఏడున్నరేళ్లలో ఎంపీగా అర్వింద్ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్ర మోద్‌కుమార్, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, విజ య, గంగారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.


