నదిలో దూకుతానంటూ యువకుడి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

నదిలో దూకుతానంటూ యువకుడి హల్‌చల్‌

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

నవీపేట: మండలంలోని యంచ శివారులోగల గోదావరి నది పైగల బ్రిడ్జిపై ఓ యువకుడు నదిలో దూకుతానంటూ హల్‌చల్‌ చేశాడు. వివరాలు ఇలా.. నవీపేటకు చెందిన యువకుడు నవీన్‌కు తల్లి మృతి చెందగా తండ్రి, అన్న వద్ద ఉంటున్నాడు. బైక్‌ కొనివ్వాలని ఇంట్లో మారాం చేయడంతో అన్న తిరస్కరించాడు. దీంతో ఆవేశానికి లోనైన నవీన్‌ గంగలో పడుతానని బెదిరించి వెళ్లిపోయాడు. సోమవారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకుని షర్ట్‌ విప్పేసి బ్రిడ్జి అటువైపు దిగి హల్‌చల్‌ చేశాడు. యంచ సర్పంచ్‌ బేగరి సాయిలు, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌ గమనించి, యువకుడి వివరాలు అడిగారు. వెంటనే అన్న సందీప్‌కు ఫోన్‌ చేయగా అక్కడికి వచ్చి, బైక్‌ కొనిస్తానని హామీ ఇవ్వడంతో వారి వద్దకు వచ్చాడు. వెంటనే బాసర పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారం క్రితం ఇంట్లో అన్న కొడుతుండని ఇలాగే బాసర గంగలో పడుతానంటూ ఇంట్లోంచి వెళ్లాడని సందీప్‌ పోలీసులకు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement