సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) బడ్జెట్ రూ.కోట్లలో కేటాయిస్తున్నా.. అభివృద్ధి పనులకు మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కార్పొరేషన్ మారిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. బీజే పీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ‘బల్దియా సమస్యలపై పోరాటం’ ఆందోళనలను నగరంలోని ధర్నా చౌక్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఉండి తాను నిజామా బాద్ అభివృద్ధి కోసం ధర్నా చేస్తున్నానంటే ప్రభు త్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చే సుకోవాలన్నారు. కార్పొరేషన్‌కు రూ.150 కోట్ల ఆ దాయం, రూ.94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా.. ఒ క్కరూపాయి ఖర్చుచేయకపోవడం సిగ్గుచేటన్నారు.
రూ.200 కోట్ల మంజూరు హామీ ఏమైంది?
నిజామాబాద్ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూ రు చేయిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని ధన్‌పాల్ ప్రశ్నించా రు. ప్రభుత్వంలో ఉండి కూడా మేయర్ ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. కాగితాలపై చూయిస్తున్న నిధులతో చేసిన రోడ్లు, నిర్మించిన డ్రెయినేజీలు, వీధి దీపాలు కనిపిస్తే ప్రజలకు ప్ర యోజనం కలుగుతుందన్నారు. కమిషనర్‌కు అనేకసార్లు కలిసి లేఖలు అందించినా స్పందించకపోవ డం తగదన్నారు. బడ్జెట్‌లో డివిజన్ల అభివృద్ధి కో సం రూ.35 కోట్లు కేటాయించినా.. ఇప్పటివరకు ఒ క్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ నిజామాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎమ్మె ల్యే, ఎంపీ కలిసి నిధులు తీసుకొస్తారన్నారు.
కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి
ధర్నాచౌక్ నుంచి కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి కి ఎమ్మెల్యేతోపాటు బీజేపీ కార్పొరేటర్లు బయల్దేర గా, పోలీసులు బారీకేడ్లు పెట్టి లోనికి వెళ్లకుండా అ డ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాటతో తీవ్ర ఉద్రిక్త త నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్‌పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిషనర్ వచ్చే వరకు కదిలేది లేదని హెచ్చరించి బైటాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ప్రమోద్‌కుమా ర్, కార్పొరేటర్లు, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయ ణ, న్యాలం రాజు, బంటు రాము, ఎర్రం సుధీర్, పులగం వైష్ణవి సుధా, విజయ, చింత ప్ర సూన శ్రీనివాస్‌రెడ్డి, బట్టు రాఘవేందర్, యాదాల నరేష్, మాదాసు స్వామి యాదవ్, విజయ్ పాల్గొన్నారు.
బడ్జెట్‌లో కేటాయింపులు కోట్లు.. పనులకు మాత్రం తూట్లు
మండిపడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి యత్నం.. నిలువరించిన పోలీసులు


