తప్పనున్న తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

తప్పనున్న తిప్పలు!

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

ఉత్తర్వులు జారీ

● ప్రభుత్వ పాఠశాలలకు

204 టాయిలెట్లు మంజూరు

● పాత మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు

ఖలీల్‌వాడి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు, 204 నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో నూతనంగా నిర్మించనుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. త్వరలో పనులను ప్రారంభించేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరుగుదొడ్లు అవసరం ఉన్న పాఠశాలల వివరాలను యూడైస్‌ ద్వారా సేకరించారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు జిల్లా విద్యా శాఖ అధికారులు నివేదికలు సమర్పించారు.

జిల్లాలో మొత్తం 1136 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, సుమారు 1.04 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో అసలే లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బాలురు ఆరుబయటికి వెళ్తుండగా, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో అవి వృథాగానే ఉన్నాయి. వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. మొత్తం సుమారు రూ.కోటి వరకు నిధులను ప్రభుత్వం కేటాయించింది. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి.

గతేడాది ముందుకు రాని కాంట్రాక్టర్లు..

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో 103 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గతేడాది ఆదేశాలు జారీ చేశారు. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. జిల్లాలోని 204 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తాజాగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సర్వశిక్షా అభియాన్‌ నుంచి ప్రతిపాదనలు పంపించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 204 మరుగుదొడ్లు మంజూరు చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరయ్యాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా కేటాయించారు. నిధుల కేటాయింపు ఎలా ఉండనుందనే దానిపై స్పష్టత లేదు. నిధులు కేటాయించగానే పనులను ప్రారంభిస్తాం.

– శ్రీధర్‌రెడ్డి, సెక్టోరల్‌ అధికారి, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement