క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

కరెంట్‌షాక్‌తో రైతు మృతి కేసు లేకుండా మీడియేషన్‌ ద్వారా సమస్య పరిష్కారం హైవేపై వాహనం బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

మాక్లూర్‌: సాగు చేసిన పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు పెట్టిన కరెంట్‌షాక్‌ ఫెన్సింగ్‌ తన పాలిట మృత్యువైంది. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్‌ తండాకు చెందిన మలోత్‌ మోహన్‌ (45) అనే రైతు సోమవారం పొలానికి వెళ్లగా.. పందుల కోసం పెట్టిన కరెంట్‌ వైర్‌కు ప్రమాదవశాత్తు తగిలాడు. వెంటనే మోహన్‌ కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి భార్య కళాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్‌ లీగల్‌: ఇద్దరు భార్యలున్న ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పంపిణీ విషయంలో ఇబ్బందులు రాగా, జిల్లా న్యాయసేవ సంస్థ ద్వార కేసు లేకుండానే విజయవంతంగా పరిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి ముద్దసాని నీలిమ సోమవారం మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు సమస్య పరిష్కారం కోసం జిల్లా న్యాయసేవ సంస్థను సంప్రదించగా, పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్య పరిష్కరించేటట్లు పలు సూచనలు చేయడంతో ఇరువర్గాల వారు రాజీకి రావడంతో సమస్య పరిష్కారమైందన్నారు. దీంతో కక్షిదారుల విలువైన సమయం, డబ్బులు వృథా చేసుకోకుండా, పోలీసు స్టేషన్ల చుట్టు తిరగకుండా త్వరితగతిన సమస్య పరిష్కరించుకునేందుకు మీడియేషన్‌ వీలు కల్పిస్తోందన్నారు.

ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై సోయవారం సాయంత్రం కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వెళుతున్న టాటా ఏస్‌ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, వాహనం రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది క్రేన్‌ సహాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ని తొలగించారు. ప్రమాద ఘటన సమీపంలోనే కల్వర్టు నిర్మాణం జరుగుతుండగా, సరైన హెచ్చరిక సూచికలు, జాగ్రత్తలు పాటించక పోవడంతో పనులు ప్రారంభమైనప్పటినుంచి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement