నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 36 ఫిర్యాదులు అందాయి. సీపీ సాయిచైతన్య ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరమైన పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలుపాలని ఆయన సూచించారు.
కమ్మర్‌పల్లి: మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన పొన్నం హరీష్ (42) ఉపాధి నిమిత్తం షార్జాకు వెళ్లగా సెప్టెంబర్ 8న కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడు. దీంతో బాధిత కుటుంబానికి ఎమిరేట్స్ తెలంగాణ కల్చర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ) చేయూత అందించింది. కోనాపూర్‌లోని హరీష్ కుటుంబ సభ్యులను సోమవారం ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్ పరామర్శించి రూ.60వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హరీష్ పార్థివదేహాన్ని షార్జా నుంచి స్వదేశానికి తరలించేందుకు భారత కాన్సులేట్, దుబాయ్ సహకారంతో అవసరమైన ఏర్పాట్లు చేయగా, హైదరాబాద్ నుంచి కోనాపూర్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్ సౌకర్యం కల్పించిందని కిరణ్‌కుమార్ తెలిపారు.


