● మేయర్ ఉమారాణి,
అదనపు కలెక్టర్ భుజంగరావు
● ఘనంగా బాపూజీ జయంతి
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణవాది, స్వా తంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని జిల్లా వె నుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు వినాయకనగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


