● బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
కమ్మర్‌పల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. తన సొంత నివాసమైన ‘జలదృశ్యం’ను తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి అప్పగించి ఉద్యమానికి కొండంత అండగా నిలిచారన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం కొండా లక్ష్మణ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ అశోక్, వీడీసీ అధ్యక్షుడు మల్యాల సుభాష్‌గౌడ్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు చింత తిరుపతి, చింత శ్రీనివాస్, బొడ్డు గణే శ్, చింత హన్మంతు, తమ్మల్ల రాకేశ్ పాల్గొన్నారు.


