కామారెడ్డి అర్బన్/ ఆర్మూర్‌టౌన్/ రామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన అపూర్వ సమ్మేళనాలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన 1982–85 బ్యాచ్ డిగ్రీ ఫిషరీస్, ఫారెస్ట్రీ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని కళాశాలలో నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం సమావేశమైన మిత్రులందరూ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత, బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌రావు, బాపురావు, రాజ్‌గంభీర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెడ్పీ బాలుర పాఠశాలకు చెందిన 1981– 82 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు స్థానిక నటరాజ్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జీ నారాయణ, ఎం ప్రదీప్ గుప్తా, బాలకృష్ణ, ప్రసాద్, జగదీశ్వర్ వర్మ, చరణ్‌్, కర్తన్ విజయ్‌పాల్, రూపాలి మురళీ, చేపూర్ నాగేందర్, దొండి మహేశ్వర్, సాత్‌పుతే శ్రీనివాస్, జనార్దన్ చంద్రశేఖర్, అల్జాపూర్ రమేశ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1999–2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.


