క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ మానసిక ఉల్లాసానికి క్రీడలు

బోధన్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఉషు క్రీడా పోటీల్లో అమ్దాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. అండర్‌–17 విభాగంలో తడపు అఖిల్‌, శివమ్‌, మీనాక్షి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. వీరు రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు ఎంపిక కావడంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సింధూబాయి, గంగోత్రి వెండి పతకాలు సాధించగా, సునీత, మౌనిక, శాలీంరాజ్‌ కాంస్య పతకాలు సాధించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం సూర్యకుమార్‌, పీడీ సునీత, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని జిల్లా జైలు పర్యవేక్షణ అ ధికారి అశోక్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జైలులో సిబ్బందికి క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయ న మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జైల ర్‌ శ్రీనివాస్‌ రెడ్డి,డిప్యూటీ జైలర్‌ మన్మద్‌రావు, న్యాయవాదులు సుజిత్‌, ఇంతియాజ్‌, ఉదయ్‌ కృష్ణ,ప్రమోదు శుభమ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పార్టీ అధ్యక్షులకే సొసైటీ చైర్మన్‌ పదవులు..?

వర్ని: కాంగ్రెస్‌ పార్టీలో మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారికి సొసైటీ చైర్మన్‌ల అవకాశం దక్కనుంది. సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన సహకార సంఘాల అధ్యక్షుల పేర్లను బాన్సువాడ ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్‌ రెడ్డి సూచన మేరకు ఖరారు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వర్ని మండలంలో మోస్రా సహకార సంఘం అధ్యక్షులుగా ప్రస్తుత పార్టీ అ ధ్యక్షులు కొత్తిమీర్‌కార్‌ లక్ష్మణ్‌, చందూర్‌ సొసైటీ అధ్యక్షులుగా పోతరాజు శీను, చింతకుంట ప్రవీణ్‌ గౌడ్‌, జాకోరా.. కూనిపూర్‌ రాజిరెడ్డి, రుద్రూర్‌.. పా ర్వతీ ప్రవీణ్‌, రాయకూరు.. తోట సంగయ్య, హు మ్నాపూర్‌.. నారోజి గంగారాం, కోటగిరి.. షా హిద్‌, పోతంగల్‌.. హెగ్డోలి.. శంకర్‌లను అధ్యక్షులుగా నియమించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. గోవూరు సొసైటీకి మాజీ అధ్యక్షులు హనుమంత రెడ్డి, చరణ్‌ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement