క్రీడా పోటీలతో యువతకు సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీలతో యువతకు సంపూర్ణ ఆరోగ్యం

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

● ఎంపీ ధర్మపురి అర్వింద్‌

నిజామాబాద్‌అర్బన్‌: క్రీడా పోటీలతో యువతకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులో అస్మితా ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తుందని అన్నారు. ఇందూరులో ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. క్రీడలకు నావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షడు మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సైక్లింగ్‌ క్రీడను ప్రోత్సహించడానికి తమ అసోసియేషన్‌ కృషి చేస్తుందన్నారు. ఈ పోటీల నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందాన్నరు. కేంద్ర ప్రభుత్వం – సైకిల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆదేశాల మేరకు అస్మితా ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సైక్లింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులతో సెల్ఫీ తీసుకున్నారు. కార్యక్రమంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నగర మేయర్‌ ఉమారాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృపాకర్‌ రెడ్డి, విజయకాంత్‌ రావు, నాయకులు పాల్గన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement