పోస్టల్‌ బీమా పథకాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బీమా పథకాలను వినియోగించుకోవాలి

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

బోధన్‌: తపాలా శాఖ ద్వారా అమలు చేస్తున్న తక్కువ ప్రీమియం కలిగిన బీమా పాలసీలను సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ నిజామాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ జనార్దన్‌ రెడ్డి సూచించారు. పోస్టల్‌ సేవలు, పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ పథకాలపై అవగాహన పెంపొందించుకుని, వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సాలూర మండలంలోని ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన శేరే నాగ్‌నాథ్‌ స్థానిక బ్రాంచ్‌ పోస్టాఫీస్‌లో ఏడాదికి రూ.755 తో ప్రమాదబీమా పాలసీ తీసుకున్నాడని తెలిపారు. కొన్ని నెలల క్రితం నాగ్‌నాథ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అతని కుటుంబానికి మంజూరైన రూ.15 లక్షల ప్రమాద బీమా చెక్కును బుధవారం అధికారులు అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్‌ శాఖ నిజామాబాద్‌ బ్రాంచ్‌ సీనియర్‌ మేనేజర్‌ ఎస్‌. కల్యాణ్‌, మేనేజర్‌ ఎం. రాజేందర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌, సర్పంచ్‌ చింతం నాగయ్య, పంచాయతీ కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement