బోధన్‌లో సీపీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

బోధన్‌లో సీపీ పర్యటన

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

బోధన్‌లో సీపీ పర్యటన మైనార్టీ కళాశాలలను మంజూరు చేయాలి సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న సినీనటుడు కిషన్‌ దాస్‌ దరఖాస్తుల ఆహ్వానం

బోధన్‌టౌన్‌(బోధన్‌): వినాయక నిమజ్జన శో భాయాత్ర నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి బోధన్‌ పట్టణంలో సీపీ సాయిచైతన్య పర్యటించారు. శక్కర్‌నగర్‌లోని వినాయక నిమజ్జన బావితోపాటు పట్టణ శివారులోని పసుపువాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన శోభాయాత్ర జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సీపీ వెంట ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ వెంకట నారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శరత్‌ రెడ్డి ఉన్నారు.

● మంత్రి అజారుద్దీన్‌కు ఎమ్మెల్యే వినతి

ఆర్మూర్‌: నియోజకవర్గంలో మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, కళాశాలను బాలు రు, బాలికలకు వేర్వేరుగా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి అజారుద్దీన్‌కు ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లో సచివాలయంలో బుధవారం మంత్రిని కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. హాస్టల్‌ భవనాల నిర్మాణాలకు సైతం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని బ్యాంకు కాలనీలోగల సిద్ధి వినాయక స్వామిని సినీనటుడు కిషన్‌ దాస్‌ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ, ఆలయ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్‌, గౌరవాధ్యక్షుడు ప్రజ్ఞాపురం పురుషోత్తం, సలహాదారులు బింగి ప్రకాశ్‌, రాజేశ్వర్‌, కేఎస్‌ఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోపాల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ధర్మారం, కంజర్‌లో ఖాళీగా ఉ న్న టీజీటీ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు గురుకులాల డీసీవో విజయలలిత బుధవారం తెలిపారు. అభ్యర్థులు బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌, ఎంఏ ఇంగ్లిష్‌తోపాటు బీఎడ్‌లో ఇంగ్లిష్‌ మెథడాలజీ కలిగి ఉండాలని పేర్కొన్నా రు. ఆసక్తి, అర్హులైన వారు నేరుగా పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. ఎంపికై న వారికి రూ.18,200 గౌరవ వేతనం చెల్లిస్తామని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement