తెయూ సమాచారం | - | Sakshi
Sakshi News home page

తెయూ సమాచారం

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

సైన్స్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి 24, 25 తేదీల్లో ఫార్మా కెమిస్ట్రీలో స్పాట్‌ అడ్మిషన్లు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ సైన్స్‌ కళాశాలలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్సిటీ ఏబీవీపీ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్‌, మోహన్‌ మాట్లాడుతూ సైన్స్‌ కాలేజీలోని ల్యాబొరేటరీల్లో అవసరమైన లిక్విడ్స్‌, కెమికల్స్‌, ఎక్విప్‌మెంట్‌ కొరత ఉందన్నారు. దీంతో విద్యార్థుల ప్రాక్టికల్‌ విద్యకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ ఉపాధ్యక్షులు అనిల్‌, లెనిన్‌, సంయుక్త కార్యదర్శి రాజేందర్‌, నాయకులు భార్గవ్‌ ప్రీతం, దీపక్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా కెమిస్ట్రీ (ఐదు సంవత్సరాల కోర్సు)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఈ నెల 24, 25వ తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ జి రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, స్థానిక అభ్యర్థి లేదా సంబంధిత రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థి అందుబాటులో లేని సందర్భంలో స్థానికేతర అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. దోస్త్‌ స్పాట్‌ అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.425గా నిర్ణయించామని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in లో పొందుపరిచినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement