పేదలందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ సంక్షేమ పథకాలు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

● కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు

నగేశ్‌ రెడ్డి

డిచ్‌పల్లి: బీఆర్‌ఎస్‌ హయాంలో ఆపార్టీకి చెందిన వారికి మాత్రమే పథకాలు అందించి, అసలైన పేదలకు అన్యాయం చేశారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలందరికీ అన్నిరకాల సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో బుధవారం ఆయన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగేశ్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామంలో 585 మందికి స్మార్ట్‌ కార్డులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఏనాడూ పేదల కోసం పనిచేయలేదని ఆరోపించారు. రేషన్‌కార్డు ఉంటే చాలు అన్నిరకాల సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ పార్టీ అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ అశోక్‌, మాజీ ఎంపీపీ నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, సొసైటీ చైర్మన్‌ గంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement