● మూలనపడ్డ ప్రధాన యంత్రం..
● చెడిపోయిన మరో మొబైల్ యూనిట్
● పట్టించుకోని వైద్యాధికారులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎక్స్‌రే మిష న్లు పనిచేయడం లేదు. ఆస్పత్రిలోని ప్రధాన ఎక్స్‌రే యంత్రం కొద్దికాలం క్రితం మూలన ప డింది. రెండు నెలలుగా చిన్న మొబైల్ ఎక్స్‌రే యంత్రంతోనే నెట్టుకొస్తున్నారు. మంగళవా రం ఆ యంత్రం కూడా మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా అత్యవస ర చికిత్స కోసం వచ్చే క్షతగాత్రులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర అస హనానికి గురైన రోగులు, వారి సహాయకులు రేడియాలజిస్ట్, ఆస్పత్రి వైద్యాధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు గత్యంతరం లేక అత్యవసర పరిస్థితిలో ప్రయివేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించారు. మరికొందరిని వైద్య కళాశాల సమీపంలోని ‘టి–హబ్’ సెంటర్‌కు రిఫర్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి, ఎక్స్‌రే యంత్రాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


