విద్యార్థులే లక్ష్యంగా గాంజా దందా | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులే లక్ష్యంగా గాంజా దందా

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

ప్రజల సహకారం అవసరం

నాందేడ్‌, ఇతర ప్రాంతాల

నుంచి అక్రమంగా రవాణా

భీమ్‌గల్‌ ఎకై ్సజ్‌ అధికారుల

విచారణలో విస్తుపోయే నిజాలు

మోర్తాడ్‌(బాల్కొండ): గంజాయి వ్యాపారులు వి ద్యార్థులే లక్ష్యంగా తమ దందాను కొనసాగిస్తున్నా రు. దీంతో డబ్బులు కూడబెట్టుకోవాలనే దురాశపరుల కుట్రకు విద్యార్థులు బలైతున్నారు. చదువుతోపాటు క్రీడలపై దృష్టిపెట్టాల్సిన సమయంలో గంజాయి మత్తులో జోగుతూ యువత తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తమపై తల్లితండ్రు లు పెంచుకున్న ఆశలను విద్యార్థి దశలోనే తుంచివేస్తున్నారు.

రూ.100కు తీసుకొచ్చి.. రూ.500కు విక్రయం.

దుండగులు మహారాష్ట్రలోని నాందేడ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.100కు తీసుకవచ్చి రూ.500లకు విక్రయిస్తుండటంతో ఆదాయం పెరిగింది. కనీసం 10 నుంచి 20 ప్యాకెట్‌లు తీసుకవచ్చి తమ దందా కొనసాగిస్తున్నారు. గంజాయిని విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు..

ఇటీవల భీమ్‌గల్‌ మండలం సంతోష్‌నగర్‌ తండా సమీపంలో ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు నిర్వహించి భీమ్‌గల్‌కు చెందిన షేక్‌ మజాస్‌ అనే గంజాయి విక్రేతను అరెస్టు చేశారు. అతని నుంచి వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని మైనర్‌ విద్యార్థులకు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో అధికారులు గంజాయికి బానిసలైన విద్యార్థులను వారి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గతంలో కూడా గంజాయి విక్రయించిన కారెపల్లికి చెందిన బూక్యా రఘును అరెస్టు చేశారు. అతడిని విచారించగా విస్తూపోయే నిజాలు వెలుగులోకి రావడం గమనార్హం. నిందితులు పలు పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు గంజాయి రుచి చూపించి, తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని తేలింది. దాదాపు 40 మంది విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను ఎకై ్సజ్‌ స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌లో మార్పు రాకపోతే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తప్పనిసరిగా పంపించాలని అధికారులు యోచిస్తున్నారు.

గంజాయిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. ప్రజలు గంజాయి విక్రేతలపైనా, బానిసలపైనా దృష్టి పెట్టి మాకు, పోలీసులకు సమాచారం అందించాలి. గంజాయి విక్రయించేవారు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు. – వేణుమాధవ్‌రావు,

ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, భీమ్‌గల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement