ఆట.. ప్రతిభచాటేలా! | - | Sakshi
Sakshi News home page

ఆట.. ప్రతిభచాటేలా!

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

జాతీయ స్థాయిలో రాణిస్తాం.. మెలకువలను నేర్చుకుంటున్నాం.. ఉత్సాహంగా ఉంది.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం కోసం..

సొంతంగా ప్రాక్టీస్‌

రాష్ట్ర, జాతీయస్థాయి

పోటీల కోసం సన్నద్ధం

వేసవి సెలవులను బాల్‌ బ్యాడ్మింటన్‌ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు

రోజూ ఉదయం, సాయంత్రం

వేళల్లో శిక్షణ

మోర్తాడ్‌(బాల్కొండ): విద్యార్థులకు ఆటలు ఆడాలని, అందులో ప్రతిభ చాటాలని ఉంటుంది. పా ఠశాలలు నడుస్తున్నప్పుడు పుస్తకాలతో కుస్తీ ప ట్టేందుకే సమయం సరిపోదు. అలాంటి విద్యార్థు లు వేసవి సెలవులను చక్కగా వినియోగించుకుంటున్నారు. మోర్తాడ్‌, తిమ్మాపూర్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బాల్‌ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతున్నారు. నిత్యం ప్రాక్టీస్‌ చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రతిభను కనబరుస్తామనే ఆ త్మ విశ్వాసంతో ఉన్నారు. బాల్‌ బాడ్మింటన్‌కు ఆ దరణ కరువైతున్న రోజులలో జిల్లా బాల్‌ బ్యా డ్మింటన్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో శిక్షణ పొందుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభ కనబరిచారు. మరికొందరు విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు.

మోర్తాడ్‌లో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతున్న విద్యార్థులు

జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో మొదటిస్థానంలో నిలువడం కోసం నిత్యం సాధన చేస్తున్నాం. ఇప్పటికే మేము జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాం. జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షతో ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాం.

– గగులోత్‌ స్వప్న, మోర్తాడ్‌

నేను జాతీయ స్థాయిలో బా ల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొన్నాను. మా గురువు ఇచ్చిన శిక్షణతో ప్రతిభ కనబరిచాం. మా జట్టు జాతీ య స్థాయిలో నెగ్గుకరావడంతోపాటు ఈ ప్రాంత విద్యార్థులు సైతం మాలాగే ప్రతిభ చూపాలని రోజూ మెలకువలు నేర్చుకుంటున్నాం. – సాయినాథ్‌, తిమ్మాపూర్‌

రోజూ సాధన చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంది. మా గురువు ఇచ్చిన శిక్షణ, ఆయన నేర్పిన నైపుణ్యాలతో సాధన చేస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఈ ప్రాంత కీర్తిని ఇనుమడింప చేస్తాం. సెలవుల ను వృథా చేయకుండా రోజూ ప్రాక్టీస్‌ చేస్తున్నాం.

– భూక్య గంగోత్రి, మోర్తాడ్‌

మా గురువు శ్యామ్‌ ఇచ్చిన శిక్షణతో దక్షిణ భారత స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను. బాల్‌ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరిచామని ఎంతో మంది మెచ్చుకున్నారు. స్పోర్ట్స్‌ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్‌ చేస్తూ జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం అవుతున్నా. – భూక్యా నవీన, మోర్తాడ్‌

వేసవి శిబిరం లేకున్నా సొంతంగానే మా టీం ప్రాక్టిస్‌ చేస్తున్నాం. బాల్‌ బ్యాడ్మింటనన్‌లో జాతీయ స్థాయి గుర్తింపు పొందాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం. మా గురువు ఇచ్చిన శిక్షణను వేసవి సెలవుల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నాం.

– జి రితిక, మోర్తాడ్‌

Advertisement
 
Advertisement
Advertisement