వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి కూలీ ..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) శుక్రవా రం వడదెబ్బతో మృతి చెందినట్లు సర్పంచ్‌ అట్టెం శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మృతుడు మూడు రోజులుగా గొర్రెలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం గొర్రెలను మేపుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఏఎన్‌ఎం రా ధిక,ఆశావర్కర్‌ మంజుల,జీపీవో ఆశమ్‌ అలీ, సా యన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి భార్య ఎల్లవ్వ, కూతుళ్లు ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని చంద్రానగర్‌లో శుక్రవారం వడదెబ్బతో ఓ కూలీ మృతి చెందాడు. 48 సంవత్సరాల వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల వరుసగా కూలీ పనులకు వెళ్తున్నాడు. చంద్రానగర్‌లోని ఇంటి వద్ద మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement