నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

May 19 2026 1:16 AM | Updated on May 19 2026 1:16 AM

న్యూస్‌రీల్‌

అధికార పార్టీ ప్రజాప్రతినిధులను

నిలదీయాలి

ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

ఎంపీ అర్వింద్‌ చిల్లర మాటలు మానుకో

కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ చేస్తే..

నిజామాబాద్‌ సంగతేంటి

ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి

మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026

ఏపీ పర్యటనకు

ఎమ్మెల్యే భూపతిరెడ్డి

డిచ్‌పల్లి: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విధివిధానాలపై అధ్య యనం చేసేందుకు 14 మందితో కూడిన ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ (రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌), వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి సైతం ఈ నెల 20, 21వ తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ముఖ్యంగా రూ.10 లక్షల ప్రమాద బీమా (ప్రవాసాంధ్ర భరో సా బీమా), ఎన్నారై విభాగం ద్వారా 24 గంటల హెల్ప్‌లైన్‌ అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

ఇసుక వాహనాలకు

జీపీఎస్‌ ట్రాకింగ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్య వస్థ ద్వారా ఇసుక లోడ్‌ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందని ఆన్‌లైన్‌లో టీజీఎండీసీ ప్రధాన కార్యాలయం నుంచి గమనిస్తారని, నిబంధనల మేరకు రవాణాకు అ నుమతులు జారీ అవుతాయని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ సో మవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించబోమని, ఇసుక అక్రమ రవాణాకు అవకాశం లే కుండా సంబంధిత శాఖల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లభించిన తరువా తే పొతంగల్‌ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీరా నది నుంచి ఇసుక రవాణాకు అనుమతిస్తామని తెలిపారు. వే బిల్లులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక వాహనాలకు అనుమతిస్తున్నారని చేశారు. జిల్లాలోని మిగతా ఇసుక రీచ్‌ల నుంచి ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతించడం జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను

ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజామాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ సెక్రెటరీ, తెలంగాణా ఇన్‌చార్జి రోష్ని జైస్వాల్‌ అన్నారు. నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో సోమవారం యూత్‌ కాంగ్రెస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రోష్ని జైస్వాల్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విపుల్‌గౌడ్‌ మట్లాడుతూ.. ప్రతి కార్యకర్త యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతం దిశగా అడుగులు వేయాలని, గ్రామ, మండ ల, అసెంబ్లీ కమిటీలకు ఆశావహుల పేర్లు ప్రతిపాదించాలని అన్నారు. జాతీయ అధికా ర ప్రతినిధి రాణి రాథోడ్‌, జిల్లా ఉపాధ్యక్షు డు అద్నాన్‌, ఆదిత్య పాటిల్‌, గడుగు రోహి త్‌, కార్తీక్‌ యాదవ్‌, మహేందర్‌, బైండ్ల ప్ర శాంత్‌, మెయిన్‌ యూనిస్‌, ముబాసిర్‌, దినే ష్‌, మతీన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా నంబర్‌ వన్‌

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: యాసంగి సీజన్‌ ధా న్యం సేకరణలో రాష్ట్రస్థాయిలో జిల్లా నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ శరవేగంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఎన్ని ఇబ్బందులను, అడ్డంకులు ఎదురైనా అధికారులు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.24 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా, సుమారు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు పంట దిగుబడి సైతం పెరిగింది. ధాన్యం సేకరించేందుకు సహకార సొసైటీల ఆధ్వర్యంలో 428 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ 262, డీసీఎంఎస్‌ 32, మెప్మా 10 ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. సెంటర్లకు ధాన్యం పోటెత్తడంతో అందు కు తగ్గట్లుగా గన్నీ సంచులు, లారీలను ఏర్పాటు చే శారు. మధ్యలో కొంత ఆటుపోట్లు ఎదురైనా సింహభాగం ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాబ్‌ ఎంట్రీ చే యిస్తూ వెంటవెంటనే మిల్లులకు తరలించారు. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలను రోజువారీగా పరిశీలించింది. కొనుగోళ్లను వేగవంతం చేసి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు. అలాగే ధాన్యం విక్రయించిన రైతులకు వెనువెంటనే చెల్లింపులు చేస్తూ వచ్చారు. దీంతో చెల్లింపుల విషయంలో రైతుల నుంచి ఎక్కడ కూడా అసంతృప్తి రాలేదు. దొడ్డు రకాలను కూడా 60,951 మెట్రిక్‌ టన్నులు సేకరించారు.

లక్ష్యాన్ని చేరుకుంటాం

యాసంగిలో నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తాం. పక్షం రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటవెంటనే డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతోనే ఇబ్బందులను తట్టుకొని ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించాం. – శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్‌వో, నిజామాబాద్‌

కొనుగోలు కేంద్రాలు 740

సేకరించిన ధాన్యం 6.08లక్షల మెట్రిక్‌ టన్నులు

ధాన్యం విక్రయించిన రైతులు 73,016 మంది

చెల్లించిన సొమ్ము రూ.1,227.29 కోట్లు

(65,746 మంది రైతులకు)

గతేడాది కూడా మనమే టాప్‌

ధాన్యం సేకరణలో నిజామాబాద్‌ జిల్లా ముందుంటోంది. గతేడాది యాసంగిలో 8లక్షల మెట్రిక్‌ టన్నులు, వానకాలంలో 7లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్‌లలో కూడా నిజామాబాద్‌ జిల్లా స్టేట్‌లో టాప్‌లో నిలిచింది. తద్వారా అధికారులకు ప్రశంసలు అందాయి. అదే ఉత్సాహంతో ఈ ఏడాది యాసంగిలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో సేకరణ కూడా పూర్తి కానుంది. మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే పక్క జిల్లా నుంచి కూడా ధాన్యం తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో

ధాన్యం కొనుగోళ్లు

ఇప్పటి వరకు 6,08,055

మెట్రిక్‌ టన్నుల సేకరణ

సమస్యలను అధిగమిస్తూ

ముందుకెళ్లిన జిల్లా యంత్రాంగం

Advertisement
 
Advertisement
Advertisement