● మోడల్ స్కూళ్లలో 1,600 ఇంటర్ సీట్లు
● కార్పొరేట్ తరహా విద్య..
● 25వ తేదీ వరకు దరఖాస్తు గడువు
● బాలికలకు హాస్టల్ వసతి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూళ్లు/కళాశాలలు వరంలా మారాయి. మోడల్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికల తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలల వైపు మొగ్గు చూపుతుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఆహ్వానిస్తున్నారు.
ఒక్కో కోర్సులో 40 సీట్లు
జిల్లాలో పది తెలంగాణ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, బాల్కొండ, నందిపేట్, నవీపేట్, రెంజల్, వర్ని మండలాల్లో ఈ మోడల్ స్కూళ్లు/కళాశాలలున్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ (అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్) కోర్సులున్నాయి. ఒక్కో కోర్సులో 40 చొప్పున మొత్తం 1,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న ఎంఈసీ కోర్సును తొలగించిన ప్రభుత్వం కొత్తగా ఏసీఈ కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తోంది. ఈ సీట్లను భర్తీ చేసేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి సైతం కల్పించనున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదివే బాలికలకు భోజనం వసతి కల్పిస్తారు.
తెలంగాణ మోడల్ స్కూల్/కళాశాల డిచ్‌పల్లి
రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలు
సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ మోడల్ స్కూల్/కళాశాలలో క్రమశిక్షణతో కూడిన కార్పొరేట్ తరహా విద్యనందిస్తున్నాం. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా సిద్ధం చేస్తున్నాం. కార్పొరేట్ తరహా విద్యనందిస్తున్నాం. ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. – పి దశరథ్,
ప్రిన్సిపాల్, తెలంగాణమోడల్ స్కూల్, డిచ్‌పల్లి
కార్పొరేట్ తరహా విద్య
ఎంపికై న విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉ చిత విద్య, 100 మంది బాలికలకు బాలికల హా స్టల్‌లో ఉచిత ప్రవేశం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేస్తారు. అలాగే కార్పొరేట్ తరహాలో విద్యార్థులకు ఈఏపీసెట్, నీట్ కోచింగ్, జేఈఈ కోచింగ్, ఫిజిక్స్‌వాలా అండ్ ఖాన్ అ కాడమీ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లకు ఉచిత ఆ న్‌లైన్ యాక్సెస్ ఇస్తారు. కెరీర్ కౌన్సెలింగ్, మీడి యా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాలలో వృత్తివిద్యాకోర్సులు, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, పని వేళల తర్వాత వివిధ సహ పాఠ్య కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తారు.


