రూ.1265.98 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.1265.98 కోట్లు

May 19 2026 1:16 AM | Updated on May 19 2026 1:16 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఈ ఏ డాది దండిగా రుణాలు అందనున్నాయి. మహిళ లు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో సెర్ప్‌ అధికారులు ఈసారి 21,473 సంఘాలకు రూ.1265,98కోట్ల రుణాలు ఇవ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్ర ణాళిక ఖరారు కాగా, మండలాల వారీగా కూడా లక్ష్యాలను నిర్ధేశించారు. గతేడాది రూ.1,228 కోట్లకు గాను లక్ష్యానికి మించి రూ.1,260 కోట్ల రుణాల పంపిణీ అలాగే రికవరీ చేయడంలో నిజామాబాద్‌ జిల్లాకు స్టేట్‌ ఫస్ట్‌ అవార్డు లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏకంగా రూ.37 కోట్లను అదనంగా పెంచారు. దీంతో ప్రతి సంఘానికి గతంలో కన్నా ఎక్కువ మొత్తం చేతికి అందే అవకాశం లభించింది. పెరిగిన నిధులతో మహిళలు కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకోవడానికి, ఉ న్న వ్యాపారాలను మరింత విస్తరించుకోవడానికి వీలు పడనుంది.

ఏర్గట్ల 327 18.13

నందిపేట్‌ 1,260 75.31

మోపాల్‌ 816 46.72

జక్రాన్‌పల్లి 855 44.15

సిరికొండ 974 56.41

నవీపేట్‌ 1,201 65.55

రుద్రూర్‌ 467 34.01

మోస్రా 322 26.56

ఎడపల్లి 938 65.06

మాక్లూర్‌ 1,078 69.85

ఇందల్వాయి 652 36.53

ఆర్మూర్‌ 967 55.45

కమ్మర్‌పల్లి 843 47.49

భీమ్‌గల్‌ 1,112 63.61

మండలం సంఘాలు లక్ష్యం

(రూ.కోట్లలో)

చందూర్‌ 212 10.70

వర్ని 701 55.23

బాల్కొండ 634 36.76

ముప్కాల్‌ 407 21.72

మోర్తాడ్‌ 671 35.34

కోటగిరి 919 51.66

ధర్పల్లి 861 49.66

వేల్పూర్‌ 962 55.68

ని.రూరల్‌ 641 35.56

రెంజల్‌ 797 50.27

మెండోరా 453 24.94

బోధన్‌ 1,299 73.40

డిచ్‌పల్లి 1,104 60.09

ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం ఖరారు

గతేడాదితో పోలిస్తే రూ.37 కోట్లు అదనం

మండలాల వారీగా టార్గెట్‌ కేటాయింపు

వందశాతం అందజేస్తాం

గత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలను అందజేసి స్టేట్‌ ఫస్ట్‌ వచ్చాం. అదే ఉత్సాహాంతో ఈ ఏడాది కూడా అందరి సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలను నూరుశాతం అందజేస్తాం.

– సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement