భగ్గుమన్న బాల్కొండ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న బాల్కొండ కాంగ్రెస్‌

May 19 2026 1:16 AM | Updated on May 19 2026 1:16 AM

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: బాల్కొండ నియోజక వర్గ కాంగ్రెస్‌ శ్రేణులు ఇన్‌చార్జి సునీల్‌రెడ్డిపై భగ్గుమంటున్నాయి. సునీల్‌రెడ్డికి, పార్టీలోని సీనియర్‌ నాయకులకు, కార్యకర్తలకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నా యి. తాజాగా చేపట్టిన మండల అధ్యక్ష పదవుల నియామకంపై ఆగ్రహించిన సీనియర్లు.. సునీల్‌తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. భీమ్‌గల్‌ లో ఆదివారం సునీల్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మెండోరా, ముప్కాల్‌ మండలాల కు చెందిన సీనియర్‌ నాయకులు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన మండలాల నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీ నాయకత్వాని కి, కీలక నేతలకు ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన తమను కాదని, కొత్తగా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి కొత్తగా వచ్చినవాళ్లకు పదవులు ఇచ్చారంటున్నారు.

నాయకుల నుంచి కార్యకర్తల వరకు..

బాల్కొండ నియోజకవర్గంలో సునీల్‌రెడ్డికి, ఆయా కార్పొరేషన్‌ల చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డికి, ఈరవత్రి అనిల్‌కు, సుంకెట అన్వేష్‌రెడ్డితో సమన్వయం లేదనేది అందరికీ తెలిసిందే. దీంతో గత స్థానిక ఎన్నికల్లో కీలకమైన మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, వేల్పూ ర్‌, బాల్కొండ, ఏర్గట్ల మేజర్‌ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్‌ చేజార్చుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చొరవ తీసుకుని సమన్వయం చేయడంతోనే భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో అతికష్టం మీద కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం మహేశ్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకుని సమన్వయం చేసి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ ముందుకు నడుస్తుందని కార్యకర్తలు అంటున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారికి పార్టీ

పదవులు ఇవ్వడంపై సీనియర్ల గుర్రు

భీమ్‌గల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి

సునీల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

తాజాగా సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు

తాడోపేడో తేల్చుకుంటామంటున్న నాయకులు, కార్యకర్తలు

Advertisement
 
Advertisement
Advertisement