సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో జి ల్లాకు రింగ్ రోడ్డు మంజూరు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా.. తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఘాటుగా విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఏం ముఖం పెట్టుకుని తిరుగుతున్నా రని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వా గ్దానాల అమలు, అభివృద్ధి చేయకపోతే మార్పు ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతుందన్నారు. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని, రైతులు, ప్రజలను మోసం చేయడం ఆయనకు ఈజీ అని ఎద్దేవా చేశారు.
ఆందోళనలకు సిద్ధం కావాలి
జిల్లాకేంద్రంలో చేపడుతున్న యూజీడీ పను లు ఇప్పటివరకు 25 శాతం కూడా పూర్తి కాలేదని అర్వింద్ అన్నారు. రూ.162.50 కోట్లకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కేవలం రూ.10.04 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు యూజీడీ ఎప్పటికీ పూర్తి కాదన్నారు. యూజీడీ, ఓఆర్‌ఆర్ సా ధించుకునే వరకూ ఆందోళనలు చేపట్టాలని, అధి కార పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రకటించి పసుపు రైతులకు ప్లాట్‌ఫాం ఇచ్చినప్పటికీ.. కార్యాలయం కోసం స్థలాన్ని కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వి మర్శించారు. ఈ విషయంలో ఉద్యమానికి సిద్ధమై న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి ఫోన్ చేసి స్థ లం కేటాయిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకూ పురోగతి లేదన్నారు. స్థలం కేటాయించకపోతే మళ్లీ ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు.


