యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

జిల్లా ఆయూష్‌ విభాగాధికారి

గంగాదాస్‌

సుభాష్‌నగర్‌: యోగా, మెడిటేషన్‌తో శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా ఆయూష్‌ విభాగాధికారి డాక్టర్‌ గంగాదాస్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని జీజీహెచ్‌, పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో యోగా, మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గంగాదాస్‌ మాట్లాడుతూ ఇంట్లోని వంట గదిలో దొరికే దినుసులను తీసుకోవడంతో ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఔషధ మొక్కలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, మెడిటేషన్‌ ద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించవచ్చన్నారు. యోగా డాక్టర్‌ తిరుపతి, విజయభాస్కర్‌ యోగాసనాలు, మెడిటేషన్‌, సాధారణ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీడియాట్రిషన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, డీహెచ్‌ఈ ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ చంద్రకళ, విజయలక్ష్మి, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement