జోరుగా సీడ్‌ మక్క కోతలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా సీడ్‌ మక్క కోతలు

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): డొంకేశ్వర్‌ మండలంలో యాసంగి మక్క కోతలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ శాతం మంది రైతులు వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకుని విత్తన మక్కను సాగు చేశారు. పంటను కోసేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు రాగా, వారికి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులు చెల్లిస్తున్నారు. కోసిన కంకులను రిక్కి బస్తాల్లో నింపిన వెంటనే వ్యాపారులు లారీల్లో లోడ్‌ చేసి తీసుకెళ్తున్నారు. ఇటు పంటను సాగు చేసిన రైతులకు ఎకరానికి రూ.3,600 చొప్పున వ్యాపారులు చెలిస్తున్నారు. సీడ్‌ మక్క సాగుతో మంచి లాభాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement