సుభాష్‌నగర్: నగరంలోని పద్మశాలీ సంఘం తర్పనెంబర్ 10 కమ్యూనిటీహాల్‌లో శుక్రవారం ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఆయూష్ శా ఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో,ఆయుర్వేద, యునాని,యోగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాజశ్రీ,ఆయూష్ వి భాగాధిపతి గంగాదాస్ మాట్లాడుతూ.. ఆయూష్ వి భాగంలో అన్నిరకాల వ్యాధులకు చికిత్సలు ఉన్నా యని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. అంతకుముందు ఔషధ మొక్క ల ప్రదర్శన, వాటి ప్రాధాన్యత, వంటింట్లో లభించే దినుసులు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శిబిరంలో రిలయన్స్ సంస్థ వారు 350 వాట ర్ బాలిళ్లు, అరటిపండ్లు ఉచితంగా అందజేశారు. కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, హోమియోపతి వైద్యులు శ్రీవాణి, యునాని వైద్యులు డాక్టర్ ఫసియుద్దీన్, వైద్యులు, సిబ్బంది, పద్మశాలి సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ప లువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం నలుగురిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి వారిలో ముగ్గురికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


