ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉషాకిరణ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉషాకిరణ్‌

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

నిజామాబాద్‌ లీగల్‌: నిజామాబాద్‌ ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉషాకిరణ్‌ నియమితులయ్యారు. నిజామాబాద్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టుతో పాటు రెండవ అడిషనల్‌ జిల్లా జడ్జిగా ఉన్న తూముకుంట శ్రీనివాస్‌ ఎల్‌బీ నగర్‌ ఫోక్సో కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ఈసందర్భంగా జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌ హా ల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్జి ఉషాకిరణ్‌ కు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికి,జడ్జి శ్రీనివాస్‌కు వీడ్కోలు పలికా రు. కార్యక్రమంలో జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి తో పాటు, వివిద కోర్టుల జడ్జీలు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నీలకంఠరావు, సుభాష్‌ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement