వాహనాల చోరీ కేసులో.. | - | Sakshi
Sakshi News home page

వాహనాల చోరీ కేసులో..

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

వాహనాల చోరీ కేసులో..

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): ఆర్మూర్‌ పరిధిలో వాహనాల చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని భీమ్‌గల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై తిరుపతి శుక్రవారం వివరాలను వెల్లడించారు. భీమ్‌గల్‌ పట్టణంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన పాస్పుల నవీన్‌ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న హీరో ఫ్యాషన్‌ బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కాగితాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఆర్మూర్‌ పరిధిలో హీరో ఫ్యాషన్‌ బైక్‌తో పాటు, బజాజ్‌ ప్యాసింజర్‌ ఆటోను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నవీన్‌ గతంలో 14 వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement