బ్యాక్‌ వాటర్‌ పంటలకు క్రాప్‌ బుకింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ వాటర్‌ పంటలకు క్రాప్‌ బుకింగ్‌ చేయాలి

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

బ్యాక్‌ వాటర్‌ పంటలకు క్రాప్‌ బుకింగ్‌ చేయాలి రూరల్‌ ఎమ్మెల్యేను కలిసిన డీఆర్‌డీఏ రోటరీనగర్‌లో గొడవ బస్టాండ్‌లో చోరీ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు కూడా క్రాప్‌ బుకింగ్‌ చేసి ధాన్యాన్ని కొనుగోలు చే యాలని డొంకేశ్వర్‌ మండల సర్పంచుల ఫో రం సభ్యులు కోరారు. ఈమేరకు వారు శుక్రవా రం అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ను కలిసి వి నతిపత్రం అందజేశారు.డొంకేశ్వర్‌తోపాటు నికాల్‌పూర్‌, అన్నారం సిర్పూర్‌, గాదేపల్లి, జీజీ నడ్కుడ, చిన్నయానం, గంగాసముందర్‌, మా రంపల్లి గ్రామాల శివారులో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం ఉందని తెలిపారు. యాసంగిలో అక్కడ సాగు చేసిన పంటలను ప్రభుత్వా నికి విక్రయించాలంటే క్రాప్‌ బుకింగ్‌ చేయాల్సి ఉందన్నారు. కావునా వ్యవసాయాధికారులతో క్రాప్‌ బుకింగ్‌ చేయించి పంటను కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. అలాగే డొంకేశ్వర్‌ మండలంలోని నికాల్‌పూర్‌ గోదావరి వద్ద పుష్కర ఘాట్‌ ఏర్పాటు చేయాలని సర్పంచుల ఫోరం కమిటీ అదనపు కలెక్టర్‌తోపాటు దేవాదాయ శాఖలో వినతిపత్రం అందజేశారు. ఫోరం అధ్యక్షుడు బట్టు సంజీవ్‌రాజ్‌, సర్పంచులు చిన్నారెడ్డి, గంగాధర్‌, సుమన్‌, దశరథ్‌ ఉన్నారు.

నిజామాబాద్‌ రూర ల్‌: నిజామాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా(డీఆర్‌డీఏ) నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయన్న శుక్రవారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పలు అంశాల పై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని 8వ డివిజన్‌లోగల రోటరీనగర్‌లో శుక్రవారం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్‌ నాయకులు రమేశ్‌, వేణురాజ్‌ రోటరీనగర్‌లో టీపాయింట్‌ వద్ద ఉండగా అక్కడికి నలుగురు మహిళలు వ చ్చి వేణురాజ్‌తో వాగ్వాదానికి దిగారు. ఇరు వు రి మధ్య గొడవ జరిగింది. స్థానిక కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌ మహిళలను పంపించి గొడ వకు కారణమయ్యాడని వేణురాజ్‌ పేర్కొన్నా రు. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. ఈ ఘటన పై 4వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని ఆర్టీసీ బ స్టాండ్‌లో శుక్రవారం చోరీ జరిగింది. ఓ ప్రయా ణికుడు బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడి బ్యాగును దొంగలించాడు. అందు లో రూ.45వేలు నగదు ఉన్నట్లు బాధితుడు పే ర్కొన్నాడు. అతడు 1వ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యా దు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement