● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
మేడపాటి ప్రకాశ్‌రెడ్డి
● సాలూర మండలంలో వడగళ్లకు
దెబ్బతిన్న పంటల పరిశీలన
బోధన్: ఈదురు గాలులు, వడగళ్ల వానతో పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాలూర మండలంలో ఇటీవల భారీ ఈదురుగాలులు, వడగళ్ల వర్షంతో కోతకు వచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని హున్సా, మందర్నా, ఖాజాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న, మొక్కజోన్న, అరటి, మామిడి, వరి పంటలను మంగళవారం సాయంత్రం ఆయన పార్టీ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మేడపాటి మాట్లాడుతూ.. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల మంజీర తీర ప్రాంతంలోని ఈ మూడు గ్రామాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా పరిహారం రాలేదన్నారు. ప్రస్తుతం వడగళ్ల వర్షానికి 2వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రతి ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్న స్థానిక ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని, పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రైతులకు తగిన పరిహారం వచ్చి న్యాయం జరిగేదని పేర్కొన్నారు. ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. బాధితు రైతులకు అండగా నిలుస్తామని, వారి పక్షాన పోరాడు తామన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందిగట్ల రాంచందర్, రావుభా గంగాధర్, ఇంద్రకరణ్, ఈ ర్వంత్‌రావు పటేల్,అశోక్ గౌడ్ పాల్గొన్నారు.


