జాతీయవాదం కోసం పనిచేసే పార్టీ బీజేపీ | - | Sakshi
Sakshi News home page

జాతీయవాదం కోసం పనిచేసే పార్టీ బీజేపీ

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే

ధన్‌పాల్‌ సూర్యనారాయణ

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఇందూరు అర్బన్‌ ప్రశిక్షణా తరగతులు ప్రారంభం

సుభాష్‌నగర్‌: జాతీయ వాదం, హిందువుల కోసం పనిచేసే ఏకై క పార్టీ బీజేపీ అని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నా రు. కార్యకర్తలు వ్యక్తుల కోసం కాకుండా బీజేపీ కోసం పని చేయాలని సూచించారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఇందూరు అర్బన్‌ ప్రశిక్షణా తరగతులు మంగళవారం నగరంలోని విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రధానంగా ఆత్మనిర్బర్‌ భారత్‌ను ప్రారంభించి ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అనే నినాదంతో దేశాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆత్మనిర్బర్‌ భారత్‌ ద్వారా దేశం ఆర్థికంగా బలపడుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా ఎప్పటికప్పుడు ప్రశిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి తెలిపారు. పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణాతరగతులు ఉంటాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతులను నిర్వహిస్తామన్నారు. ప్రతి కార్యకర్త ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్‌రెడ్డి, పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement