సుభాష్‌నగర్: నగరంలోని కలెక్టరేట్ ఐడీఓసీలో ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు రెండోరోజు మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉద్యోగులు జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉద్యోగుల కోసం సిరిధాన్యాలు, గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా ఆరుగురిలో హైపర్ టెన్షన్, నలుగురిలో మధుమేహాన్ని గుర్తించామన్నారు. అదేవిధంగా ఆరుగురు క్షయ వ్యాధి బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ప్రోగ్రాం అధికారి ఎన్‌సీడీ వెంకన్న, డీఎస్‌వో వెంకటేష్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్వినీ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై అవగాహన
ఖలీల్‌వాడి: నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్‌వో రాజశ్రీ హాజరై, మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ప్రిన్సిపల్ రాజేందర్, డాక్టర్ రవితేజ, రాజ్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


