హనుమాన్‌ శోభాయాత్ర.. దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ శోభాయాత్ర.. దారి మళ్లింపు

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించే హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌ దారి మళ్లింపు చేపడుతున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదా రులు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో దుకాణాదారులు, వ్యాపారస్తులు తమ వాహనాలను రోడ్ల పక్కన నిలిపి ఉంచరాదని పోలీసులు సూచించారు.

వాహనాలు ఇలా వెళ్లాలి

హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ వచ్చి పోయే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బస్టాండ్‌, జెడ్పీ క్రాస్‌ రోడ్‌, సుభాష్‌నగర్‌ రామాలయం, రవి పబ్లిక్‌ స్కూల్‌, ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల జంక్షన్‌ నుంచి చంద్రశేఖర్‌ కాలనీ రోడ్డు చౌరస్తా నుంచి కంఠేశ్వర్‌ బైపాస్‌ జంక్షన్‌ చేరుకొని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ వైపు వెళ్లాలి. తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్‌ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. బోధన్‌ నుంచి వచ్చిపోయే వాహనాలు అర్సపల్లి రైల్వే గేట్‌ నుంచి కొత్త కలెక్టరేట్‌ నుంచి చంద్రశేఖర్‌ కాలనీ రోడ్డు చౌరస్తా, ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి సుభాష్‌నగర్‌ రామాలయం, రవి పబ్లిక్‌ స్కూల్‌, జెడ్పీ జంక్షన్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. బాన్సువాడ నుంచి వచ్చి పోయే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి పులాంగ్‌ సర్కిల్‌, కోర్టు సర్కిల్‌, ఎన్టీఆర్‌ చౌరస్తా, రైల్వేస్టేషన్‌ గుండా ఆర్టీసీ బస్డాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు

ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రెడ్డి

వర్ని: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. బుధవారం వర్ని మండలం పాత వర్ని వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్‌ కమిటీ, నెహ్రూనగర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వర్ని ప్రాంతంలో వరి కోతలు ముందస్తుగా ప్రారంభమవుతున్న దృశ్య అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వర్ని మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో రూ. కోటి 50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వివిధ అభివద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మార్కెట్‌ కమిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 60 లక్షలు, రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 40 లక్షలతో మురికి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో వర్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేశ్‌ బాబా, డీసీసీబీ కార్యదర్శి వెలగపూడి గోపాల్‌, వర్ని తహసీల్దార్‌ సాయిలు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సాయిబాబా, నేమాని వీర్రాజు, సత్యనారాయణపురం సర్పంచ్‌ కనకదుర్గ రవి, సర్పంచ్‌ బాల్‌ సింగ్‌, పీసీసీ డెలిగేట్‌ రాజిరెడ్డి, సహకార సంఘం సీఈవో గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement