రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

ఇద్దరి మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌కు రెండేళ్ల జైలు

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్‌ రహమాన్‌(34) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్‌ గ్రామానికి చెందిన రహమాన్‌ సిరికొండలో లతీఫ్‌ టీ పాయింట్‌లో పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన పని ముగిసిన తర్వాత బైక్‌పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నిజామాబాద్‌ లీగల్‌: ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి ఇద్దరి వ్యక్తుల మృతికి కారణమైన డ్రైవర్‌కు నిజామాబాద్‌ జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి రెండేళ్ల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించారు. 1నవంబర్‌2018న నందిపేట్‌ నుంచి నిజామాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా నడిపిన బస్సు డ్రైవర్‌ రాథోడ్‌ అశోక్‌ ఆంధ్రనగర్‌ వద్ద ఓ మోపెడ్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో టీవీఎస్‌ మోపెడ్‌ పై ప్రయాణిస్తున్న గడ్డల సాయిలు, చందూరి రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సాయిలు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ఆర్మూర్‌ కోర్టుకు తరలించారు. దర్యాప్తు చేపట్టిన ఆర్మూర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు డ్రైవర్‌ రాథోడ్‌ అశోక్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. ఐదు వేల జరిమానా విధించింది. ఆర్మూర్‌ కోర్టు తీర్పుపై డ్రైవర్‌ అశోక్‌ నిజామాబాద్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఆర్మూర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించిన జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి, ఆర్మూర్‌ కోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని ఆదేశించారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం సందర్శన

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ న్యాయశాస్త్ర వి భాగం విద్యార్థులు బు ధవారం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ కా ర్యాలయాన్ని సంద ర్శించారు. లా ఆఫ్‌ ప్రాపర్టీ పాఠ్యాంశంలో భాగంగా బీవోఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ స్రవంతి సూచన మేరకు విద్యార్థులు కార్యాలయాన్ని సందర్శించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ లు రవికాంత్‌, సతీశ్‌, ప్రసాద్‌ తదితరులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నిర్వహించే వివిధ కార్యకలాపాలను విద్యార్థులకు వివరించారు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌, వాటి క్రయ విక్రయాలపై అవగాహన కల్పించారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ లను విద్యార్థులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement