ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నాగుపాము కలకలం రేపింది. గ్రంథాలయంలోకి మంగళవారం రాత్రి పాము రావడంతో పాఠకులు భయబ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్‌తో రాత్రి నుంచి పామును పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. బుధవారం ఉదయం గ్రంథాలయం మొదటి అంతస్తులోని పుస్తకవిభాగంలో నాగుపామును పట్టుకున్నారు. డబ్బా లో దానిని బంధించారు. దీంతో గ్రంథాల య సిబ్బంది, పాఠకులు ఊపిరి పీల్చు కున్నారు. గ్రంథాలయ ఆవరణ అవతలి వైపు ఉన్న బాల భవన్ ప్రాంగణం, పాత డీఈవో కార్యాలయంలోని ఖాళీ స్థలంలో చెత్తా చెదారం ఉండటంతో గ్రంథాలయ భవనంలోకి విషసర్పాలు వస్తున్నట్లు గ్రంథాలయ సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు.


