నల్లవెల్లిలో యువకుడి ఆత్మహత్య
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్‌చార్జి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. వివరాలు ఇలా.. నల్లవెల్లి గ్రామానికి చెందిన పనాస అనిల్(28) అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. కొన్ని నెలల క్రితం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి మోసపోయి అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం గ్రామశివారులోని రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వేట్రాక్‌మన్ గుర్తించి రైల్వే పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం అనిల్‌దిగా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇస్సానగర్‌లో ఒకరు..
బీబీపేట: మండలంలోని ఇస్సానగర్‌లో ఓ వ్యక్తి ఆ త్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. వివరాలిలా.. ఇస్సానగర్ గ్రామానికి చెందిన ధర్మగారి రాజాగౌడ్ (34) ఇస్సానగర్ గ్రామ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. అతడికి అప్పులు ఎక్కువ కావడంతో ఆ ర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో నే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికి త్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అ క్కడ పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నల్లవెల్లిలో యువకుడి ఆత్మహత్య


