రైల్వే పనుల పరిశీలన
ఇటుక ధరలు నియంత్రించాలి
మోపాల్: ఇటుక ధరలు నియంత్రించాలని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బోడ మహేందర్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదక్‌పల్లి, నర్సింగ్‌పల్లి గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ఇటుకబట్టీలు వెలుస్తున్నాయని తెలిపారు. ఒక్కో ఇటుక ధర రూ.10 లకుపైనే అమ్ముతున్నారని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.
నవీపేట: డబుల్ రైల్వేలైన్ విస్తరణలో భాగంగా బాసర నుంచి నవీపేట వరకు పూర్తయిన పనులను రైల్వేసేఫ్టీ కమిషనర్ మాధవి, డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. నవీపేట, ఫకీరాబాద్, బాసర రైల్వే స్టేషన్లలో పూర్తయిన నూతన భవనాలను సందర్శఇంచారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన సౌకర్యాలను నేరుగా పరిశీలించారు. పనుల పరిశీలనకు వచ్చిన రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నవీపేట, ధర్యాపూర్, తడగాం గ్రామాల డెవలప్‌మెంట్ కమిటీ ప్రతినిధులు, నాయకులు పలు సమస్యలను విన్నవించారు. నవీపేట రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు.
రైల్వే పనుల పరిశీలన


