రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఖలీల్‌వాడి: ప్రభుత్వ బడుల బలోపేతానికి విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతను ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను తయారు చేసి వారికి అప్పగించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్‌ఎం, ప్రధానోపాధ్యాయులు సోమవారం నుంచి రంగంలోకి దిగారు. జిల్లాలో మొత్తం పదకొండు బృందాలు పాఠశాలల తనిఖీని ప్రారంభించాయి. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న ప్రత్యేక బృందాలు అక్కడి పరిస్థితులను విద్యా శాఖాధికారులకు నివేదిక రూపంలో అందించనున్నారు. బడిలో పరిస్థితులు మారా యా? లేదా? అనే విషయాలపై ఆరా తీస్తారు. విద్యార్థుల ప్రగతితోపాటు రికార్డులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. విద్యార్థుల హాజ రు, ఉపాధ్యాయుల పనితీరు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మొదటి రోజు 11 ప్రత్యేక బృందాలు జిల్లాలోని 11 పాఠశాలలను తనిఖీ చేశాయి.
తూతూ మంత్రపు తనిఖీలకు చెక్
జిల్లాలో డీఈవో పరిధిలో 1,156 పాఠశాలలు ఉ న్నాయి. అలాగే 10 మోడల్ స్కూళ్లు, 27 కేజీబీవీలు ఉండగా వీటిని మండల విద్యాధికారులు, సెక్టోరల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. అయితే చాలా మంది తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో విద్యా శాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయుల తో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రత్యేక బృందాల స భ్యులు డిప్యూటేషన్‌పై పనిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్‌ఎం, ప్రాథమి కోన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్‌ఎం, ఎస్జీటీ ఒకరు చొప్పున ఉంటారు. అలాగే ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో ఏడుగురు ఎస్‌ఏలు, ఒక పీ డీ, ఒక పీజీ హెచ్‌ఎం ఉన్నారు. మొత్తం 51 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌పై విధులను కేటాయించారు. వారంతా పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. వారానికోసారి లేదా పదిహేను రోజులకో సారి నివేదికను డీఈవో కార్యాలయంలో అందజేయనున్నారు. వాటి ఆధారంగా జిల్లా విద్యాశాఖాధికారి రివ్వ్యూ నిర్వహించనున్నారు.
సర్దుబాటు
తనిఖీ బృందాల్లోకి వెళ్లిన ఉపాధ్యాయుల స్థా నాల్లో ఇతర ఉపాధ్యాయులను సర్దుబాటు చే యనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. తనిఖీ బృందాల్లో స్కూల్ అసిస్టెంట్‌లకు బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది. పదో తరగతి పరీక్ష నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇతర ఉ పాధ్యాయులను సర్దు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తి చేస్తారో వేచి చూడాల్సిందే.
పాఠ్యాంశాల బోధన, రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సో మవారం నుంచి తనిఖీలను ప్రారంభించాయి. తనిఖీ అనంతరం వారం రోజుల్లో బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆ నివేదికల ఆధారంగా డీఈవో సమీక్షించనున్నారు.
తనిఖీలు కొనసాగుతున్నాయి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్ ఉన్నత పాఠశాలలకు 11 బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. పాఠశాలల్లో అకడమిక్ తదితర రికార్డులను పరిశీలించి డీఈవో కార్యాలయానికి వేదికలు సమర్పించాల్సి ఉంటుంది. – బాలకృష్ణ, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి
ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలల తనిఖీ
వారానికోసారి జిల్లా విద్యాశాఖకు
నివేదిక!
రిపోర్టుల ఆధారంగా క్షేత్రస్థాయి
పరిస్థితులపై సమీక్షించనున్న డీఈవో
జిల్లాలో 11 ప్రత్యేక బృందాలు


