టికెట్ ప్లీజ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితుల్లో నిజామాబాద్ నగర కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో ఆశావహుల టిక్కెట్ల ఆరాటం సందడిని సృష్టిస్తోంది. నిజామాబాద్ నగరపాలకంలో మేయర్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నెలకొంది. మరోవైపు నగరంలో ఎంఐఎం కింగ్‌మేకర్ పాత్ర తనదేనని ఆశాభావంతో ఉంది. అవసరమైతే మేయర్ పదవిని సైతం పంచుకునేందుకు అవకాశం దక్కుతుందని ఎంఐఎం లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్నికల ఫలితాల తరువాత సమీకరణాలు ఎలా మారతాయోననే చర్చ నగరంలో నడుస్తోంది. మొత్తంమీద పోరు రసవత్తరం కానుంది.
నిజామాబాద్ నగరంలో బీజేపీ టికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 500కు పైగా ఉండడం గమనార్హం. ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా. ఇక కాంగ్రెస్ టికెట్‌లు ఆశిస్తూ సోమవారం ఒక్కరోజే 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజర్వేషన్ల కేటాయింపునకు ముందే కాంగ్రెస్ టికెట్ల కోసం 400 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రిజర్వేషన్ల మేరకు వీ టిలో 180 మాత్రమే అర్హత ఉన్నవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. మరిన్ని దరఖాస్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం నుంచి టికెట్ల కోసం 20 డివిజన్‌ల పరిధిలో 157 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టికెట్ రాకపోతే జంప్
నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో పలువురు తమకు టికెట్లు దక్కకపోతే మరో పార్టీలోకి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. తాము ఆశించిన పార్టీలో అవకాశం కల్పించకపోతే జంపింగ్ జపాంగ్‌లుగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే స్వతంత్రులుగా సై తం బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల కు రెబల్స్ బెడద తప్పేలా లేదు. అయితే పార్టీ లు మాత్రం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని స్ప ష్టం చేస్తున్నాయి. వివిధ సర్వేల మేరకు అన్ని అంశాలను బేరీజు వేసుకుని టిక్కెట్ల కేటాయింపులు చేస్తామని పార్టీల నాయకులు చెబుతున్నారు
దరఖాస్తుల జాతర
కాంగ్రెస్, బీజేపీలో భారీగా డిమాండ్
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ల కోసం పోటాపోటీ
అవకాశం ఇవ్వకపోతే పార్టీలు
మారేందుకు పలువురు సిద్ధం
టికెట్ ప్లీజ్


