ఆర్గానిక్ పసుపునకు డిమాండ్
● సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
● ప్రభుత్వం తరఫున రైతులకు తోడ్పాటు
● పసుపు బోర్డు తొలి వార్షికోత్సవ సభలో ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపునకు డిమాండ్ ఉందని, రైతులు సేంద్రియ విధానంలో పసుపు సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమ వారం జిల్లాకేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవ గాహనా సదస్సు నిర్వహించారు. ఎంపీ అర్వింద్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శి ఎన్ భవాని శ్రీ (ఐఏఎస్), రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కా ర్యక్రమాలను బోర్డు చైర్మన్, కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందన్నా రు. మూడు దశాబ్దాలకుపైగా ఈ ప్రాంత రైతు లు అలుపెరగకుండా కొనసాగించి న పోరాటా లు, నిరవధిక కృషి ఫలితంగా జాతీ య పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం ఏర్పాటు చేసిందన్నా రు. బోర్డు ఏర్పాటైన ఫలితంగా ఇక్కడి పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోందని, విదేశాలకు ఇక్కడి పసుపు పంటను పరిచయం చేయడంలో బోర్డు సఫలీకృతమైంద ని పేర్కొన్నారు. మున్ముందు బోర్డు ద్వారా పసు పు రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నా యని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగు చేస్తే మరింత డిమాండ్ ఉంటుందని ఎంపీ సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పసు పు రైతుల సాధకబాధకాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారికి ప్రభుత్వపరంగా జి ల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. పసు పు ఎగుమతులు అంతర్జాతీయ స్థాయిలో జరిగే లా పసుపు బోర్డు విశేషంగా కృషి చేస్తోందన్నా రు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్‌రావు, పసుపు బోర్డు అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.


