రెండేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
బోధన్: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎక్కడా చూసినా అవినీతి, దోచు కోవడమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్ర జలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎ మ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సోమ వా రం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వేము ల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. త్వరలో జరగనున్న ము న్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల మోసా న్ని ఇంటింటా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీశ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. బోధన్ పట్టణ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే షకీల్ రూ. వంద కోట్లు నిధులు తీసుకొచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని పనులు మొదలు పెట్టలేదని విమర్శించారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
షకీల్ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి తన ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కక్షసాధింపులకు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎంఐఎం పట్ట ణ మాజీ అధ్యక్షుడు ముషీర్‌బాబా, శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు సంజీవ్, నర్సింగ్‌రావు, శ్రీరాం, భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీల మోసాన్ని
ఇంటింటా ప్రచారం చేయాలి
జిల్లాలోని మున్సిపాలిటీలపై గులాబీ
జెండా ఎగురవేస్తాం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి


