పామాయిల్ సాగు లాభదాయకం
బోధన్: పామాయిల్ పంట సాగు అధిక లా భదాయకంగా ఉంటుందని, మార్కెటింగ్ ఇ బ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు. కోతుల బెడద ఉండద ని, పామాయిల్ పంటను అధిక విస్తీరణంలో సాగు చేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులోని పామాయిల్ ఫ్యాక్టరీని ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి సుదర్శన్‌రెడ్డి సోమవా రం సందర్శించారు. జంగా రాఘవరెడ్డి ఫ్యా క్టరీకి సంబంధించిన వివరాలను సుదర్శన్‌రెడ్డికి వివరించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్, రెంజల్ మండలాల కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్‌రావు, మోబిన్, రైతులు ఉన్నారు.
ఎన్నికలకు
సిద్ధంగా ఉండాలి
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మున్సిపాలిటీని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. బల్దియా ఆవరణలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి పంపిన ప్రతిపాదనల వివరాలు కమిషనర్ జాదవ్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. వ చ్చే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని, నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొ చ్చని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగే లా అన్ని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
క్రీడల్లో పోటీతత్వం ముఖ్యం
నిజామాబాద్ అర్బన్: క్రీడల్లో పోటీతత్వం ముఖ్యమని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రమోద్ స్మారక ఫుట్‌బాల్ పో టీలు సోమవారం ముగిశాయి. సీపీ ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు ట్రోఫీ ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్ త్యా గం పోలీస్‌శాఖకు ఎల్లప్పుడూ గుర్తుండిపో తుందన్నారు. యువతలో క్రమశిక్షణ, ఐక్య త, దేశభక్తిభావాలను పెంపొందించడం కో సం ప్రమోద్ స్మారకార్థం టోర్నీని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పామాయిల్ సాగు లాభదాయకం
పామాయిల్ సాగు లాభదాయకం


