మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలుస్తోంది
నిజామాబాద్ రూరల్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గె లిచి తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తులను పట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షులకు సమర్పించాలని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారని, రాష్ట్రాన్ని మళ్లీ అప్పులపాలు చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ , నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రం, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గన్‌రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


