ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌లో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయారెడ్డి, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వొల్కాజీ విఠల్, కార్యదర్శి అరుణ్, ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వర్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు.


