నియామకం
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి తండాకు చెందిన బానోత్ గణేశ్ జిల్లా ఆలిండియా బంజారా యూత్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మూడిందల్‌నాయక్ చేతుల మీదుగా గణేశ్ నియామకపత్రం అందుకున్నారు. గణేశ్ మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయనను సంఘ సభ్యులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సంతోష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రమావత్ మోహన్‌నాయక్, ఉపాధ్యక్షుడు సేవాలాల్‌నాయక్, కోశాధికారి రవి, బోధన్ యూత్ నాయకుడు నరేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


