సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నిరసన
నిజామాబాద్ అర్బన్: బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ నిరసన తెలిపారు. సీఎం చట్టాలకు ఏమైనా అతీతు డా అని ఆయన ప్రశ్నించారు. అధికారిక హోదాలో ఉన్న సీఎం చట్ట వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ఆస్తుల విధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్‌రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు.


