ఇందూరును స్మార్ట్ సిటీగా మారుస్తాం
నిజామాబాద్ రూరల్: ఇందూరును స్మార్ట్ సిటీగా మారుస్తామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని గూపన్‌పల్లి, ముబారక్ డివిజన్‌లో రూ. రెండు కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గంగస్థాన్ ఫేస్–2లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూపన్‌పల్లి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం గ్రామస్తులు భూమిని సేకరించి ఇస్తే నిర్మాణం కోసం పనులు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వం గూపన్‌పల్లి అభివృద్ధిని మర్చిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గూపన్‌పల్లికి రూ. ఆరు కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని అన్నారు. అనంతరం ముబారక్‌నగర్ డివిజన్‌లో డ్రెయినేజీ, సీసీ రోడ్లు, కల్వర్టులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీప్రియనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని స్థానికులను కోరారు. సీడీపీ నిధులతో రూ. 10 లక్షలతో మహిళా భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్‌కు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, యూత్ నాయకులు నరేశ్, నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, చిరంజీవి, హనుమాండ్లు, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, లక్ష్మీ ప్రియ నగర్ కాలనీ అధ్యక్షుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిజామాబాద్ రూరల్
ఎమ్మెల్యే భూపతిరెడ్డి
గూపన్‌పల్లి, ముబారక్‌నగర్ డివిజన్లలో రూ. రెండు కోట్ల అభివృద్ధి
పనులకు శంకుస్థాపన


